ఏపీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాల పేరిట 98 లక్షలు కాజేసిన సంస్థ..!

-

సాఫ్ట్ వేర్ ఉద్యోగాల పేరిట రూ.98 లక్షలను కాజేసి.. బోర్డు తిప్పేసింది సాఫ్ట్ వేర్ సంస్థ అయిన ఎస్.ఎల్.సి.సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. నంద్యాల లోని టీటీడీ రోడ్డులో ఏడాది నర్ర క్రితం సంస్థను ఏర్పాటు చేసారు ఉప్పరి వెంకట్ , మరో నలుగురు వ్యక్తులు. ఐ.టి రంగంలో శిక్షణ, ఉద్యోగ కల్పన చేస్తామని ప్రచారం చేసారు సంస్థ ప్రతినిధులు. అయితే నాలుగైదు మందికి ఉద్యోగాలు రావడంతో సంస్థపై నిరుద్యోగుల్లో నమ్మకం పెరిగింది.

అయితే ఒక్కరి నుండి రూ 1.20లక్షల చొప్పున 76 మంది నుండి రూ 98 లక్షలు వసూలు చేసిన సంస్థ ప్రతినిధులు.. ఉద్యోగాలు ఇప్పించకుండా.. డబ్బు వాపస్ ఇవ్వకుండా మొహం చాటేశారు. అయితే బాధితుల ఫిర్యాదు మేరకు ఉప్పరి వెంకట్ , హైదరాబాద్ లోని గిజిలీజ్ సాఫ్ట్ వేర్ కంపెనీ సి.ఈ. ఓ.రవి చంద్రా రెడ్డి.. మరో ఇద్దరి పై కేసు నమోదు చేసారు పోలీసులు. ఇందులో ప్రధాన నిందితుడు ఉప్పరి వెంకట్ కోసం పోలీసుల గాలింపు చర్యలు మొదలు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news