పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన అందరికి తెలిసిందే. తన సినిమాను అభిమానులతో కలిసి చూదాం అని థియేటర్ కు అల్లు అర్జున్ రావడంతో.. సరైన సెక్యూరిటీ లేకపోవడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఇక ఈ తొక్కిసలాటలోనే ఓ మహిళా మృతి చెందగా ఆమె కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటన పై కేసు నమోదు చేసింది పోలీసులు.. లిస్ట్ లో ఆలు అర్జున్ పేరు ను కూడా నమోదు చేసారు.
అయితే తాజాగా ఈ పుష్ప 2 తొక్కిసలాట కేసులో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ యజమానితో పాటుగా మేనేజర్ ను కూడా అరెస్టు చేసారు పోలీసులు. సరైన భద్రతా చర్యలు చేపట్టని కారణంగా మేనేజర్ ను అరెస్టు చేసారు. అయితే ఈ అరెస్టు చేసిన ముగ్గురిని రిమాండ్ కు పంపించారు చిక్కడపల్లి పోలీసులు.