ఎంపీ అవినాష్ రెడ్డి పిఏకి పులివెందుల పోలీసుల నోటీసులు..!

-

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డికి పులివెందుల పోలీసులు 41 ఏ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు అనే దానిపై విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. అయితే రేపు ఉదయం కడపలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రా రెడ్డి కేసులో ఆయనతో పాటు రాఘవరెడ్డి కూడా నిందితుడిగా ఉన్నారు.

ఇక ఈ కేసు నేపథ్యంలో గత 25 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన.. ఈరోజు ఇంటికి వచ్చారు. అయితే ఈనెల 12వ తేదీ వరకు రాఘవరెడ్డి పై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో.. ఆయన బయటకు వచ్చారు. గతంలో రెండు సార్లు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై విచారణకు రావాలంటూ రాఘవరెడ్డి ఇంటికి పులివెందుల పోలీసులు నోటీసులు అంటించారు. ఇక ఈరోజు మరో మరు ఆయనకు 41 ఏ నోటీసులు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news