విద్యారంగాన్ని దిగజార్చి ప్రైవేటు బడులకు వెళ్లేలా చేస్తున్నారు : మాజీ సీఎం జగన్

-

విద్యార్థులు అపరిశుభ్రమైన ఆహారం తిని ఆరోగ్యంపాడై ఆస్పత్రుల్లో చేరుతున్న ఘటనలు టీడీపీ ప్రభుత్వ హయాంలో కోకొల్లలుగా ఉన్నాయి అని మాజీ సీఎం జగన్ అన్నారు. పిల్లలు వెళ్లే గవర్నమెంటు స్కూళ్లలో టాయిలెట్ల నిర్వహణకోసం ఇచ్చే టాయిలెట్‌ మెయింటినెన్స్‌ ఫండ్‌, స్కూళ్ల నిర్వహణకోసం ఇచ్చే స్కూల్‌ మెయింటినెన్స్‌ ఫండ్‌ ఈరోజు ఏమైంది? ఆరోజు టాయిలెంట్ల మెయింటినెన్స్‌ గురించి గానీ, స్కూళ్ల మెయింటినెన్స్‌ గురించి గానీ ఎవరైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. అలాగే అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే ఇలా ప్రభుత్వ విద్యారంగాన్ని దిగజార్చి, కావాలనే సమస్యలు సృష్టించి ఉద్దేశ పూర్వకంగా ప్రైవేటు బడులకు వెళ్లేలా చేస్తున్నారు అని పేర్కొన్నారు.

ఇక తల్లిదండ్రులు చదువు కొనుక్కునేలా వారిపై ఆర్ధికభారం మోపి, ఇప్పుడు అదే పిల్లల ముందుకు, తల్లిదండ్రులకు ముందుకు వెళ్లి ఏమార్చే మాటలు చెప్పడానికి సిగ్గేయడంలేదా. విద్యాదీవెన, వసతి దీవెనల కింద గతంలో విద్యార్థులకు ఇచ్చే తోడ్పాటు ఇప్పుడు లభిస్తోందా? ఈ జనవరి వస్తే నాలుగు త్రైమాసికాలుగా ఎలాంటి చెల్లింపులు లేవు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇచ్చే వసతి దీవెన, విద్యాదీవెన ఈ రెండింటికీ కలిపి ఏకంగా రూ.3,900 కోట్లు బకాయిలుగా పెట్టి, ఈరోజు పిల్లలను ఉద్ధరిస్తున్నట్టుగా మీరు చేస్తున్న డ్రామా మరో డీవియేషన్‌ రాజకీయం కాదా అని ప్రశ్నించారు జగన్.

Read more RELATED
Recommended to you

Latest news