ఏపీలోని అన్నమయ్య జిల్లా పీలేరు ప్రభుత్వ ఆస్పత్రిలో మందులు, సెలైన్ బాటిళ్లు కొరవడినట్లు తెలుస్తోంది. ప్రతి మందును బయట నుంచి తెచ్చుకోవాలని అధికారులు చెబుతున్నారని ఆస్పత్రికి వచ్చిన రోగులు చెబుతున్నారు. వంద పడకల ఆస్పత్రిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఈ దుస్థితి నెలకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
అయితే, ఓ మహిళ తన కుటుంబంతో కలిసి ఆస్పత్రికి రాగా.. తన కుటుంబంలోని యువతికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో సెలైన్ పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, తమ వద్ద సెలైన్ బాటిళ్లు అందుబాటులో లేవని, బయట నుంచి తెచ్చుకుంటే పెడతామని అందులోని సిబ్బంది చెప్పడంతో రోగులు షాక్ అయ్యారు. సెలైన్ బాటిల్ చేతబట్టుకుని బయటే కూర్చున్నారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
👉అన్నమయ్య జిల్లాలో పీలేరు ప్రభుత్వాసుప్రతిలో మందులు, సెలైన్ బాటిళ్లు లేవంట.
👉ప్రతి మందును బయట నుంచి తెచ్చుకోవాలని చెబుతున్న అధికారులు.
👉వంద పడకల అసుపత్రిలో కొరవడిన పర్యవేక్షణ.. pic.twitter.com/wpvaote7jy
— ChotaNews (@ChotaNewsTelugu) December 10, 2024