ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు పై తెలంగాణ రాచకొండ పోలీసులు సీరియస్ అయ్యారు. కవరేజ్ కు వెల్లిన మీడియా ప్రతినిధులపై దాడి చేయడంతో డిపార్టమెంట్ అంతా అప్రమత్తమైంది. మోహన్ బాబు వద్ద ఉన్న గన్ తో పాటు మంచు విష్ణు వద్ద ఉన్న గన్ ను కూడా స్వాధీనం చేసుకోవాలని స్థానిక పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గతంలో జూబ్లీహిల్స్ నుంచి ఇద్దరూ గన్ లైసెన్స్ పొందారు. కొద్ది సేపటి కిందట జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసానికి మంచు మనోజ్, మౌనిక దంపతులు చేరుకున్నారు.
జల్ పల్లి మోహన్ బాబు ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించేందుకు నిరాకరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మనోజ్ గేట్లు తోసుకొని లోపలికి వెళ్లారు. మనోజ్ తో పాటే మీడియా ప్రతినిధులు కూడా లోపలికి వెళ్లారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబును మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మీడియా ప్రతినిధులపై దారుణంగా.. అత్యంత దౌర్జన్యంగా ప్రవర్తించారు. స్వయంగా ఓ న్యూస్ ఛానల్ మైక్ లాక్కొని కొట్టారు. ఈ దాడిలో ఇద్దరూ మీడియా ప్రతినిధులను గాయాలయ్యాయి.