మోహన్ బాబుకు అస్వస్థత నెలకొంది. దింతో మోహన్ బాబు ను ఆసుపత్రికి తరలించారు. బీపీ ఎక్కువ కావటంతో మోహన్ బాబును స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఇక అటు మోహన్‌బాబుకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
రేపు ఉదయం తమ ముందు హాజరుకావాలని ఆదేశించారు.. రేపు ఉదయం 10.30 గంటలకు గన్స్ సరెండర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. ఈ మేరకు మోహన్‌బాబుకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు..
కాగా, జల్ పల్లి మోహన్ బాబు ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించేందుకు నిరాకరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మనోజ్ గేట్లు తోసుకొని లోపలికి వెళ్లారు. మనోజ్ తో పాటే మీడియా ప్రతినిధులు కూడా లోపలికి వెళ్లారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబును మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మీడియా ప్రతినిధులపై దారుణంగా.. అత్యంత దౌర్జన్యంగా ప్రవర్తించారు. స్వయంగా ఓ న్యూస్ ఛానల్ మైక్ లాక్కొని కొట్టారు. ఈ దాడిలో ఇద్దరూ మీడియా ప్రతినిధులను గాయాలయ్యాయి.