గురుకుల విద్యార్థులను బతకనివ్వరా? : కేటీఆర్ రీట్వీట్

-

తెలంగాణ ప్రభుత్వం గురుకులాలపై అనుసరిస్తున్న తీరును విద్యార్థి సంఘాలతో పాటు పిల్లల పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చేసిన సోషల్ మీడియా పోస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి రీపోస్టు చేశారు. ‘2024 సంవత్సరంలో, దేశంలోనే అత్యధిక పర్-క్యాపిట ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 1,50,000 వేల కోట్లు ఖర్చుబెట్టి మురికి కాలువలు ముస్తాబు చేసుకునేంత దమ్మున్న ధనిక రాష్ట్రంలో..

పక్క రాష్ట్ర నాయకుల భజన చేయడానికి విజయోత్సవాల పేరుమీద కోట్లు ఖర్చు పెట్టగల సత్తా ఉన్న ప్రభుత్వంలో.. తెలంగాణ రైసింగ్, ఫ్యూచర్ సిటీ అని గొప్ప గొప్ప మాటలు మాట్లాడే నాయకులు ఉన్న రాష్ట్రంలో.. పసి బిడ్డలు తింటే సచ్చిపోకుండా ఉండే బువ్వ పెట్టలేకపోతున్నామా? ఇంత దారుణమా? గురుకుల విద్యార్థులని బతకనివ్వరా? ఇప్పటికే 50 మంది చనిపోయారు. ఇంకెంతమంది పిల్లలు సచ్చిపోతే నిద్ర లేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం?’ అని రేవంత్ సర్కారును నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news