మా నాన్న అంటే ప్రాణం..మా అన్న, వినయ్ ట్రాప్ చేశారు అని సంచలన కామెంట్స్ చేసారు మంచు మనోజ్. నిన్న రాత్రి మీడియాపై మోహన్ బాబు దాడి చేసిన సంఘటన పై మంచు మనోజ్ స్పందించారు. మీడియాపై మోహన్ బాబు దాడి చేసిన సంఘటన స్థలంలో,మీడియపై దాడులను ఖండిస్తూ,జర్నలిస్టు ప్రతినిధులు ప్రొటెస్ట్ చేస్తుండగా మద్దతు తెలిపారు మంచు మనోజ్. మీడియాకు క్షమాపణలు చెప్పారు.
మా నాన్న, అన్న తరఫున మీడియా మిత్రులకు నేను క్షమాపణలు చెబుతున్నాను అన్నారు. జర్నలిస్టు మిత్రులకు నేను అండగా ఉంటాను… ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదని చెప్పారు. నేను ఎవరినీ ఎలాంటి ఆస్తులు అడగలేదు…. నా భార్య, 7 నెలల కూతురిని ఇందులోకి లాగుతున్నారని ఫైర్ అయ్యారు మంచు మనోజ్. మా నాన్న ను మా అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారు…. మా నాన్న దృష్టిలో నన్ను శత్రువు గా చిత్రీకరించారని ఆగ్రహించారు.