పేర్లు మార్చడమే సీఎం రేవంత్ పనా.. ఇంకేమీ లేదా? : ఎమ్మెల్యే మాధవరం

-

ప్రభుత్వ సంస్థలు, విగ్రహాల పేర్లు మార్చడమే సీఎం రేవంత్ రెడ్డి పనా అని కూకట్ పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ ఆవరణలో ప్రతిష్టిస్తామని స్పష్టంచేశారు. బుధవారం కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని తెలంగాణ తల్లి విగ్రహానికి ఆయన క్షీరాభిషేకం చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో చేయాల్సిన అభివృద్ధి పనులను పక్కన పడేసి సంస్థల పేర్లు, విగ్రహాలను మార్చడమే సీఎం రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లిని తీసేసి బతుకమ్మ లేని కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని పెట్టడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు. 1969లో ఆనాడు కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుండా మోసం చేసిందని, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతోనే ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని కృష్ణారావు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news