ఐదు పదులు దాటాక కూడా విడాకులు..? ఇందుకు ముఖ్య కారణాలు ఏంటంటే..?

-

పెళ్లితో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. పెళ్లి అంటే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అయితే ఈ రోజుల్లో చాలామంది దంపతులు విడిపోతున్నారు. పెళ్లి తర్వాత కొన్నాళ్ళకు కొంతమంది విడిపోతూ ఉంటే లేట్ వయసులో కూడా కొంతమంది విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. ఐదు పదులు దాటిన తర్వాత విడిపోతున్న జంటలు కూడా ఉన్నారు. గ్రే డివోర్స్ ఈ మధ్యన ట్రెండింగ్ అవుతోంది. అయితే అసలు భార్యాభర్తలు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు? లేట్ వయసులో కూడా ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు అనే దానికి కారణాలు చూద్దాం.

ఎదుగుదల్లో అసంతృప్తి

కొంతమంది చిన్న వయసులో పెళ్లి చేసుకుంటూ ఉంటారు తర్వాత వ్యక్తిగత ఆశయాల కంటే కూడా సామాజిక బాధ్యతలకు ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. ఈ కారణంగా చాలామంది భార్యాభర్తల మధ్య ఇబ్బందులు వస్తున్నాయి. అలా విడిపోవాలని విడాకులు తీసుకుంటున్నారు.

ప్రేమపై మారుతున్న అభిప్రాయాలు

కొంతమంది 50 ల తర్వాత కూడా వారికి నచ్చని వ్యక్తితో జీవితాన్ని గడపాలని చూస్తున్నారు. అందుకోసం పెళ్లి అయినా కూడా ఆ విషయాలన్నీ వదిలేసి విడాకులు ఇచ్చేస్తున్నారు. దీంతో చాలామంది లేట్ వయసులో కూడా విడిపోతున్నారు.

బాధ్యతలు తీరి

పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు చాలామంది విదేశాలకి కూడా వెళ్ళిపోతున్నారు. బాధ్యతలు తగ్గిపోతాయి. అప్పటిదాకా పిల్లల కోసం అడ్జస్ట్ అయిన భార్య భర్తలకి ఇప్పుడు స్వేచ్ఛ దొరుకుతుంది. ఇక విడాకులు తీసుకుని విడిపోవాలని, ఎవరిదారి వాళ్ళు చూసుకోవాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇలా కూడా చాలామంది 50 తర్వాత విడాకులు తీసుకుంటున్నారు.

మనీ ఫ్రీడం

ఈరోజుల్లో చాలామంది మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. డబ్బు విషయంలో ఫ్రీడమ్ ఉంటుంది కొంచెం బాధ ఉన్నా కూడా సంబంధాల్ని సహించట్లేదు. ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా విడిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. ఈ కారణంగా కూడా చాలామంది విడిపోవాలని విడాకులు తీసుకుంటున్నారు.

ప్రతి బంధానికి కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. సరైన కమ్యూనికేషన్ తో ఎలాంటి బంధం అయినా మార్చుకోవచ్చు. సమస్యని పరిష్కరించుకోవచ్చు. ఒకరితో ఒకరు మాట్లాడుకుని సమస్యల్ని చర్చించుకోవాలి సమస్యని పరిష్కరించుకుంటే ఇబ్బందులు ఉండవు హాయిగా సంతోషంగా ఉండొచ్చు. ఒకరు చెప్పేది ఒకరు వింటూ ఒకరు గౌరవించుకుంటూ ఉంటే సంతోషంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news