రాష్ట్రంలో ఇటీవల గురుకుల విద్యార్థులు తరచుగా ప్రమాదాల బారిన పడుతున్నారు. గురుకులాల వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మొన్నటివరకు ఫుడ్ పాయిజన్ ఘటనలతో గురుకులాల విద్యార్థినీ, విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు. ఆస్ప్రతుల పాలై ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇద్దరు విద్యార్థులు ఈ ఘటనలో మృతి చెందిన విషయం తెలిసిందే.
తాజాగా మరో విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. ఈ ఘటన నల్గొండ – కేతేపల్లి మండలంలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. అక్కడి మూసీ గురుకులలో ఐదో తరగతి చదువుతున్న నీలం సాయి గణేష్ పాము కాటుకు గురయ్యాడు. దీంతో వెంటనే అతన్ని చికిత్స కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కాగా, గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత లేకపోవడం వల్లే విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తోందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.
గురుకులలో ఐదో తరగతి విద్యార్థికి పాముకాటు
నల్గొండ – కేతేపల్లి మండలం మూసీ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న నీలం సాయి గణేష్ పాము కాటుకు గురయ్యాడు.
వెంటనే చికిత్స కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. pic.twitter.com/1CYxmVWOiz
— Telugu Scribe (@TeluguScribe) December 13, 2024