రాష్ట్రంలోని గురుకులాల సమస్యలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే విద్యార్థులకు తామున్నాం అంటూ భరోసా కల్పించే ప్రయత్నాన్ని గులాబీ పార్టీ చేస్తోంది. ఈ క్రమంలోనే మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సమీకృత బాలుర వసతి గృహంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు.
హాస్టల్లో ఉన్న సమస్యలఫై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తాము పడుతున్న ఇబ్బందులను హరీష్ రావు ద్రుష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
హాస్టల్లో మెను పాటిస్తున్నారా?, సరైన భోజనం పెడుతున్నారా? అని విద్యార్థులను మాజీ మంత్రి హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి హాస్టల్ భోజనాన్ని హరీశ్ రావు తిన్నారు. ఆహారం నాణ్యతగా ఉండాలని వార్డెన్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది.
విద్యార్థులతో కలసి భోజనం చేసిన హరీష్ రావు
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సమికృత బాలుర వసతి గృహంలో ఆకస్మికంగా సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
హాస్టల్లో ఉన్న సమస్యలఫై విద్యార్థులను అడిగి తెల్సుకున్న హరీష్ రావు..
పలు సమస్యలు హరీష్ రావు ద్రుష్టికి తెచ్చిన విద్యార్థులు..… pic.twitter.com/HYiTiQwMkV
— Telugu Scribe (@TeluguScribe) December 13, 2024