సంగారెడ్డిలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. వాటి విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

-

రాష్ట్రంలో ఒక్కసారిగా భారీగా డ్రగ్స్ కలకలం రేపాయి. సంగారెడ్డి జిల్లాలోని మొగుడంపల్లి మండలం మాడిగి అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద డీఆర్ఐ, నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్, సెంట్రల్ విజిలెన్స్ బృందాలు నిర్వహించిన తనిఖీల్లో రూ.50 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుబడినట్లు సమాచారం. డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారంతో అధికారుల ముందుగానే చెక్ పోస్టు వద్దకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు.

ఈ క్రమంలోనే ఓ లారీలో తరలిస్తున్న డ్రగ్స్‌ను పట్టుకోవడంతో పాటు వాహనాన్ని సైతం సీజ్ చేశారు. లారీ డ్రైవర్, క్లీనర్ పరారైనట్లు సమాచారం. పట్టుబడిన డ్రగ్స్ ను ఏపీలోని కాకినాడ ఓడరేవు నుంచి ముంబయి తరలిస్తున్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను చిరాగ పల్లి పీఎస్‌కు తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news