ఈ ఏడాదిని క్రికెట్ ప్రేమికులు అస్సలు మర్చిపోలేరు. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ వరల్డ్ కప్పుతో మనవాళ్లు విజయకేతనం ఎగరవేశారు. మన దేశానికి అటు వన్డే వరల్డ్ కప్ ని ఇటు టీ20 ప్రపంచ కప్ ని కెప్టెన్ గా ధోని అందజేశాడు. ధోని తర్వాత వచ్చిన క్రికెట్ టీం కెప్టెన్లు వన్డే వరల్డ్ కప్ ని గానీ టీ20 వరల్డ్ కప్ ని గానీ అందించలేకపోయారు. ఒక్క రోహిత్ తప్ప.
రోహిత్ శర్మ.. అందరూ హిట్ మాన్ గా ముద్దుగా పిలుచుకునే రోహిత్ శర్మ.. ఈ ఏడాది భారతదేశానికి టీ20 వరల్డ్ కప్ ని అందజేశాడు. అఫ్ కోర్స్.. అతడు కెప్టెన్ గా ఉన్నాడు. టీంలో ఇంకా చాలామంది ఉన్నారు. అయినా కూడా.. రెండు వరల్డ్ కప్ లు అందించిన ఘనత ధోనీకి దక్కినట్టే ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ని అందించిన ఘనత రోహిత్ కి దక్కుతుంది.
వెస్టిండీస్ లోని బార్బడోస్ లో దక్షిణాఫ్రికా తో జరిగిన ఫైనల్ మ్యాచ్‍లో భారత జట్టు విజయకేతనాన్ని ఎగరవేసి ఇండియాకు రెండవ టీ20 వరల్డ్ కప్ ని అందించింది.
ఈ మ్యాచ్‍లో కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి 76 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ లో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు పడగొట్టి ఇండియాకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్ లో హైలైట్ గా నిలిచింది సూర్య కుమార్ పట్టిన క్యాచ్. సిక్సర్ గా వెళుతున్న బంతిని క్యాట్ పట్టుకుని ఇండియాకు అతడు విజయాన్ని అందించాడు.
మొత్తానికి రోహిత్ శర్మ సారథ్యం వహించిన భారత జట్టు సమిష్టి కృషితో క్రికెట్ అభిమానులకు మరిచిపోలేని అనుభవాన్ని ఇచ్చింది.