సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టైన విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు రెండు గంటల పాటు విచారించారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చి ఆసుపత్రి సూపరింటెండెంట్ సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత గాంధీ ఆసుపత్రి నుంచి నాంపల్లి కోర్టుకు బన్నీని తరలిస్తున్నారు. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం పోలీసులకు రిపోర్టులు అందజేశారు గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బంది.
చిక్కడపల్లి పీఎస్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా.. పోలీస్ స్టేషన్ బయట ఉన్న అభిమానులను చూసి బన్నీ అభివాదం చేశారు. అలాగే గాంధీ ఆసుపత్రి నుంచి నాంపల్లి కోర్టుకు తరలిస్తున్న తరుణంలో అల్లు అర్జున్ అభిమానులు అభివాదం చేశారు. భారీ బందోబస్తు మధ్య నాంపల్లి క్రిమినల్ కోర్టుకు తరలించారు. కోర్టు ఏం చెబుతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండటం విశేషం.