విజయవాడ ఇంద్రాకిలాద్రి భవాని దీక్ష ల సందర్బంగా ప్రత్యేకమైన యాప్ ని లాంచ్ చేశారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ భగవత్ దర్శించుకున్నారన్నారు. ప్రభుత్వం తరఫునుండి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికామని వెల్లడించారు. అమ్మవారి దర్శనం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం ఇప్పించామని… 21వ తేదీ నుండి భవానీ భక్తులు మాలవిరమణ కి ఇంద్రకీలాద్రి కి వస్తున్నారని పేర్కొన్నారు.
ఏడాది సుమారు ఐదు లక్షలపై చిలుక భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. వచ్చేటు వంటి భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని వివరించారు. కనకదుర్గ నగర్ లో మూడు హోమగుండాలను ఏర్పాటు చేసి, ఇరుముడి బియ్యానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. దూర బారాల నుంచి కాలినడకన వచ్చేటటువంటి భావానీలకు హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశాము….రాష్ట్రం నలుమూలల నుంచి భవానీలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారన్నారు. ఈరోజు ఒక యాప్ ని లాంచ్ చేసాము… ఆ యాప్ ద్వారా భవానీని ఎంతమంది వచ్చారు… రోజుకి ఎంతమంది వస్తున్నారు అని అంచనా ఈ యాప్ ద్వారా తెలుస్తుందని వివరించారు.