అల్లు అర్జున్ ఏం ఘనకార్యం చేశారని అంత మంది పరామర్శించారు : మహిళ కమిషన్ చైర్మన్

-

సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజను పరామర్శించారు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద, మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభ రాణి. అనంతరం నేరెళ్ల శారద మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల తో బాబు ను పరామర్శించాం. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తోడుగా ఉంటుందని హామీ ఇచ్చాము. ప్రభుత్వం తరుపున సహాయం కోరితే తప్పక చేస్తాం అని పేర్కొన ఆమె.. ప్రభుత్వం సిస్టం ప్రకారమే చర్యలు తీసుకుంది అని అన్నారు.

ఇక మేము ఈలలు కొట్టి చప్పట్లు కోడితేనే మీరు హీరోలు, సెలబ్రెటీ అయ్యారు. ఆ ఆవిషయం గుర్తు పెట్టుకోవాలి. అల్లు అర్జున్ ఏం ఘనకార్యం చేశారని అంత మంది పరామర్శించారు. అదే పరామర్శ గాయపడ్డ బాబుకు ఎందుకు చూపించడం లేదు. మీకు ఒక న్యాయం వీళ్లకు మరో న్యాయమా అని ప్రశ్నించిన శ్రీ తేజ కుటుంబానికి తొడుగా ఉన్నాం అని మహిళ కమిషన్ చైర్మన్ శోభ రాణి స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news