పోలవరం ప్రాజెక్టును ఇవాళ సందర్శించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రాజెక్టు పనులు పరిశీలన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల షెడ్యూల్ విడుదల చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ప్రాజెక్టు ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ట్రైల్ రన్ నిర్వ హించిన అధికారులు.. ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్, ఎస్పీ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు…పర్యటనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా.. ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా.. వైసీపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును పట్టించుకోలేదని టీడీపీ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కానీ చంద్రబాబు సీఎం అయిన తర్వాత.. పోలవరం ప్రాజెక్టు పనులు జోరుగా సాగుతున్నాయని ప్రచారం చేస్తున్నారు టీడీపీ పార్టీ నేతలు. ఏపీకి జీవనాడి పోలవరం ప్రాజెక్టు అన్నారు.
- ఈరోజు పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన
- ఉదయం 10.45కు హెలికాప్టర్ లో పోలవరం చేరుకోనున్న ముఖ్యమంత్రి
- ముందుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం పరిశీలన
- అనంతరం పోలవరం ప్రాజెక్ట్ అధికారులతో సమీక్ష
- మధ్యాహ్నం ఒంటిగంటకు మీడియా సమావేశం నిర్వహించనున్న సీఎం చంద్రబాబు
- సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు