తెలంగాణ అసెంబ్లీలో పవర్ కట్ అయింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శాసనసభలో కరెంట్ బంద్ అయింది. ఇవాళ ఉదయం 8:30 కి బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో కరెంటు కోతలు చోటు చేసుకున్నాయి.
ఇక దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రకటనలకే పరిమితమైన 24 గంటల విద్యుత్ అంటూ మండిపడుతున్నారు. లగచర్ల రైతులను బంధించిన అంశంపై చర్చించేందుకు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వనుంది బీఆర్ఎస్ పార్టీ. ఇక అటు లగచర్ల రైతన్నలకు బేడిలు వేసిన ప్రభుత్వ వైఖరి పైన నిరసనగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల నినాదాలు చేస్తున్నారు. రైతులకు బేడీల సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్లకార్డులను శాసనసభలోకి తీసుకుపోకుండా అడ్డుకున్నారు పోలీసులు.
అసెంబ్లీలో పవర్ కట్
అసెంబ్లీ సమావేశాల రోజే BRSLPలో కేటీఆర్‌తో చర్చిస్తుండగా, అరగంటలో 5 సార్లు పవర్ కట్స్ జరిగాయన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు pic.twitter.com/NlVxXhp0c1
— Telugu Scribe (@TeluguScribe) December 16, 2024