నూజివీడులో కల్లోలం చోటు చేసుకుంది. టీడీపీ నేతలతో జోగి రమేష్ ర్యాలీలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఆసక్తికరంగా గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ జరిగింది. టీడీపీ నేతలతో కలిసి పర్యటించారు మాజీ మంత్రి జోగి రమేష్.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి పార్థసారథి, టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి నూజివీడు లో ర్యాలీలో పాల్గొన్నారు జోగి రమేష్. ఆ తర్వాత విగ్రహ ఆవిష్కరణ లో పాల్గొననారు జోగి రమేష్. అయితే… టీడీపీ నేతలతో జోగి పర్యటనపై చర్చ జరుగుతోంది. ఏలూరు జిల్లా నూజివీడులో ఆసక్తికరంగా గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కు జోగి రమేష్ హాజరు కావడంతో…. టీడీపీ పార్టీ లోకి వెళతారని అంటున్నారు. మరి దీనిపై వైసీపీ పార్టీ కీలక నేత జోగి రమేష్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.