ప్రారంభమైన బీఏసీ సమావేశం.. హాజరైన మాజీ మంత్రి హరీశ్ రావు!

-

రాష్ట్రంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ కొనసాగుతున్నాయి. సభ ప్రారంభానికి ముందు బీఏసీలో ఏజెండా గురించి ఏం ప్రస్తావన లేకుండా టూరిజం గురించి చర్చించడంపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సీరియస్ అయ్యింది. సభా సమావేశాలు సజావుగా సాగేందుకు బీఏసీ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పింది.

ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో బీఏసీ సమావేశం ప్రారంభమైంది. దీనికి ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క,శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. బీఆర్​ఎస్​ నుంచి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ, సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరయ్యారు. ఇందులో అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాన్ని ప్రధాన అజెండాగా నిర్ణయించనున్నారు. అనంతరం దానిపై వాడీవేడీగా చర్చలు కొనసాగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news