అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ శాసన మండలిలో బీసీ సంక్షేమం, బడ్జెట్ కేటాయింపులు, నిధుల ఖర్చు పై మాట్లాడారు. గత పదేళ్లలో బీసీలకు కేటాయించింది రూ.8 వేల కోట్లు అయితే బీసీల సంక్షేమానికి ఖర్చు చేసింది మాత్రం రూ. 800 కోట్లు అని మంత్రి కుండబద్దలు కొట్టారు.
ఈ విషయంపై చర్చకు ఎవరొచ్చినా సిద్ధమే అంటూ శాసన మండలిలో మంత్రి పొన్నం సవాల్ విసిరారు. గత ప్రభుత్వం బీసీలను చిన్నచూపు చూసిందని, వారి సంక్షేమానికి పెద్దగా నిధులు కేటాయించలేదని మంత్రి పొన్నం ధ్వజమెత్తారు.కానీ, తమ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారి కోసం నిధులు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు.