2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి : సీఎం చంద్రబాబు

-

2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడమే మా లక్ష్యం అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తాజాగా పోలవరం ప్రాజెక్ట్ ని  సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ రివర్స్ విధానాలతో అస్తవ్యస్థంగా మారిన పోలవరానికి జవసత్వాలిచ్చి పనులను పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందని తెలిపారు. అధికారం చేపట్టిన వెంటనే తొలి పర్యటనగా పోలవరానికి వచ్చిన సీఎం చంద్రబాబు ప్రాజెక్ట్ పై తనకు ఉన్న అంకిత భావం ఎళాంటిదో చెప్పారు.

మా హయాంలో 72 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. పాత, కొత్త కాంట్రాక్టర్లుంటే జవాబుదరి తనం కష్టతరం అవుతోంది. ప్రాజెక్ట్ ను నిర్లక్ష్యం చేయడం వల్ల రూ.2,400 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని తెలిపారు సీఎం చంద్రబాబు. పదేళ్లుగా పట్టిసీమ ప్రాజెక్ట్ కే గత ప్రభుత్వం శ్రీరామ రక్ష అయిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 15 నెలల పాటు ఎలాంటి నిర్మాణ పనులు చేయలేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news