నేడు పార్లమెంటులో జమిలి ఎన్నికల బిల్లు రానుంది. ఇందులో భాగంగానే… “129 వ రాజ్యాంగ సవరణ బిల్లు”ను తీసుకురానుంది ఎన్‌డీఏ కూటమి. ఇక ఈ బిల్లు ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తే ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగానే… లోక్‌సభ కు తప్పనిసరిగా హాజరుకావాలని ఇప్పటికే బిజేపి ఎంపీలకు విప్ జారీ చేయడం జరిగింది.
సభలో బిల్లు ను ప్రవేశపెట్టి, చర్చకు అనుమతించేందుకు సాధారణ మెజారిటీ ఉంటే సరిపోతుందని అంటున్నారు. “రాజ్యాంగ సవరణ బిల్లు” ను లోకసభ, లేదా రాజ్యసభ ఆమోదించాలంచే, మూడింట రెండింతల సభ్యుల మెజారిటీ ఉండాలని చెబుతున్నారు. లోకసభ కు తప్పనిసరిగా హాజరుకావాలని ఇప్పటికే పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది బీజేపీ అధినాయకత్వం. ఈ మేరకు లోక్‌సభా కార్యక్రమాల జాబితాను ( లిస్ట్ ఆఫ్ బిజినెస్) విడుదల చేశారు లోకసభ సెక్రటరీ జనరల్. జమిలి బిల్ పాస్ అయితే… 2029 మే నెలలో లోకసభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది.