తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. ఆర్టీసీ ఉద్యోగాలపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ఆర్టీసీలో కొత్తగా 3039 ఉద్యోగాలు ఉన్నట్లు తెలిపారు. 3000కు పైగా ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు కూడా… కీలక ప్రకటన చేశారు పొన్నం ప్రభాకర్.
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలకు లింకు రోడ్లు ఏర్పాటు చేయబోతున్నామని కూడా వివరించారు పొన్నం ప్రభాకర్.వేములవాడ ధర్మపురి కొండగట్టు క్షేత్రాలను కలుపుతూ… ఆర్టీసీ బస్సుల లింకింగ్ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన సమయంలో ఆర్టీసీలో 55,000 మంది ఉద్యోగులు ఉంటే…ప్రస్తుతం 40 వేల మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని వివరించారు. 15 సంవత్సరాలు దాటిన ఆర్టీసీ బస్సులను స్క్రాప్ కు పంపిస్తామని వివరించారు.