ముంబైలో గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలోని తీరంలో ఘోర బోట్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు. దాదాపు 110 మంది కి పైగా ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీ బోటును స్పీడ్ బోటు ఢీ కొట్టింది. దీంతో ప్రమాదవశాత్తు ఫెర్రీ బోటు మునిగిపోయింది. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ కోస్ట్‌గార్డ్స్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దాదాపు 101మందిని రక్షించారు. రెండు మృతదేహాలను కూడా వెలికి తీశారు.
ఇంకా పది నుంచి 12 మంది వరకు గల్లంతు అయినట్టు సమాచారం. గల్లంతైన వారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడ్డ వారు ప్రస్తుతం ఇండియన్ కోస్ట్‌గార్డ్ షిప్ సుభద్ర కుమారి చౌహాన్‌లో ఉన్నారు. ఎలిఫెంటా ద్వీపానికి ఫెర్రీలో వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.