వాస్తు : మీ ఇంట్లో ఈ మార్పులు చేస్తే.. కాసుల వర్షం కురుస్తుంది..!

-

వాస్తు ప్రకారం నడుచుకుంటే మంచి జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. వీటిని కనుక ఫాలో అయినట్లయితే ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడొచ్చు. అలాగే సమస్యల నుంచి గట్టెక్కొచ్చు. వాస్తు ప్రకారం చాలామంది అనుసరిస్తూ ఉంటారు. అయితే ఇలా చేస్తే మాత్రం సమస్యల నుంచి సులువుగా బయటపడడానికి అవుతుంది. తూర్పు లేదా నైరుతి వైపు ఒక చిన్న ఫౌంటెన్ ని పెడితే మంచి జరుగుతుంది. సానుకూల శక్తి ప్రవహిస్తుంది. నిరంతరం నీళ్ల ప్రవాహం ఉండడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే కెరియర్ లో మంచి అవకాశాలు రావడానికి, శ్రేయస్సు కలగడానికి ఉత్తరం వైపు అక్వేరియం ని పెట్టండి.

చేపలు తొట్టిని ఇంట్లో ఉండడం వలన మంచి జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అక్వేరియంని ఆగ్నేయం వైపు ఉంచితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి అవుతుంది. పేదరికం నుంచి కూడా బయటపడొచ్చు. ధనవంతులు అవ్వచ్చు. ఇంటి దక్షిణం వైపు ఫీనిక్స్ పక్షి లేదా జేడ్ ప్లాంట్ ని పెట్టండి. ఇది కూడా సంతోషాన్ని కలిగిస్తాయి. సంపదని అందిస్తాయి.

ఇంట్లో స్పటిక కమలాలను పెడితే కూడా మంచిది. స్పటిక కమలను ఇంటి నైరుతివైపు పెడితే మంచి జరుగుతుంది. ధనాన్ని ఆకర్షిస్తుంది అదృష్టాన్ని తీసుకొస్తుంది. వీటితో పాటుగా ఇంట్లో మొక్కలు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ఎప్పుడు కూడా వాడిపోయిన మొక్కలు ఉండకూడదు. అలాంటివి తొలగించాలి. మొక్కలు ఎప్పుడు పచ్చగా ఉండాలి. అప్పుడే శ్రేయస్సు కలుగుతుంది. సంతోషంగా ఉండొచ్చు. ఇంటి నుంచి ప్రధాన ద్వారం దాకా మార్గాన్ని స్పష్టంగా ఉంచాలి. ఇలా ఈ మార్పులు చేస్తే డబ్బుకి లోటు ఉండదు. సంతోషంగా ఉండొచ్చు ఏ బాధ ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news