చంద్రబాబు నాయుడు సర్కార్ పై జగన్ సంచలన కామెంట్స్ చేశారు. పలావు పోయిందీ, బిర్యానీ పోయిందంటూ చంద్రబాబు నాయుడు సర్కార్ కు చురకలు అంటించారు. అమరావతిలో నేతలతో జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ… ఆరు నెలలు తిరక్కముందే చంద్రబాబు ప్రభుత్వంమీద తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీద లేదన్నారు.
చంద్రబాబు గారిని నమ్మడమంటే.. చంద్రముఖిని లేపడమే, పులినోట్లో తలపెట్టడమే అని ఆరోజు చెప్పానని గుర్తు చేశారు. దాన్ని ఇవాళ చంద్రబాబుగారు నిజం చేస్తున్నారని ఆగ్రహించారు. జగన్ పలావు పెట్టాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు అన్నాడని నిప్పులు చెరిగారు. ఇప్పుడు పలావు పోయిందీ, బిర్యానీ పోయిందన్నారు. ఆరునెలల్లోనే రూ. 20 వేల కోట్లకుపైగా భారాన్ని ప్రజలపై కరెంటు ఛార్జీల రూపంలో వేశాడని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు.