సరికొత్త కాన్సెప్ట్ తో ‘UI’.. ఉపేంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్

-

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన నటించిన రా, ష్, ఏ, ఉపేంద్ర, రక్త కన్నీరు, కన్యాదానం వంటి చిత్రాలు సూపర్ హిట్ సాధించాయి. ప్రత్యేకత ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేయడం ఉపేంద్ర స్టైల్. వాస్తవానికి ఉపేంద్ర సినిమా వస్తుందంటే కన్నడ, తెలుగు సినిమా థియేటర్ల వద్ద జాతరను తలపించేలా ఉండేది. గత కొద్ది సంవత్సరాలుగా ఉపేంద్ర దర్శకత్వానికి గ్యాప్ ఇచ్చాడు. ఎక్కువగా కేవలం హీరోగా మాత్రమే సినిమాలను చేస్తున్నాడు.

Upendra UI
Upendra UI

గత ఏడాది కబ్జా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆయన స్వీయ దర్శకత్వంలో UI మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడారు ఉపేంద్ర. ఈ చిత్రం ఓపెనింగ్ సీన్ ఎలా ఉంటుందోనని హింట్ ఇచ్చాడు. ఓపెనింగ్ సీన్ లోనే ప్రేక్షకులకు షాకింగ్ గా ఉంటుందని వెల్లడించారు. మరోవైపు  ఈ చిత్రం క్లైమాక్స్ సైతం మీరు ఊహించిన దాని కంటే సరికొత్తగా ఉంటుందని తెలిపారు. మారుతున్న కాలం, టెక్నాలజీకి అనుగుణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలిపారు. ఈ చిత్రం దాదాపు అందరికీ నచ్చుతుందని తెలిపారు. యూఐ సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని పేర్కొన్నారు ఉపేంద్ర.

ఉపేంద్ర ఓపెనింగ్ సీన్, క్లైమాక్స్ గురించి చెప్పడంతో చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఈ మూవీ ఓపెనింగ్ ఎలా ఉంటుంది.. క్లైమాక్స్ ఎలా ఉంటుందోననే ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రం కోసం పలువురు ఉపేంద్ర అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news