హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు, చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా నుంచి కాపాడేందుకు హైడ్రా ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో పెల్లుబిక్కిన ప్రజా గ్రహంతో హైడ్రా యూటర్న్ తీసుకుందని.. నిన్నటి వరకు తగ్గేదే అంటూ బుల్డోజర్లతో గర్జించిన ఆ సంస్థ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిందంటూ వస్తున్న ప్రతీ ఒక్కరిలోనూ మెదులుతున్నాయి. ఎఫ్ఠీఎల్, బఫర్ జోన్లు అంటూ భయపెట్టిన హైడ్రా వెనక్కి తగ్గిందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కూల్చివేతల విషయంలో హైడ్రా ఎలాంటి యూటర్న్, బ్యాక్ టర్న్ తీసుకోలేదన్నారు. ప్రభుత్వ పాలసీ ప్రకారం తమ సంస్థ కార్యచరణ ఉంటుందని తెలిపారు. 2024 జులైకి ముందుకు పర్మిషన్లు ఉన్న ఇళ్లను కూల్చబోమని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం అన్ని ఇండ్లను కూల్చదలుచుకుంటే లక్షలాది ఇళ్లను తాము కూల్చాల్సి ఉంటుందన్నారు. హైడ్రా ఏర్పాటైన తరువాత అనుభవాలతో కొన్ని పాలసీలను మార్చుకున్నామని తెలిపారు.