అసెంబ్లీ నుండి నేరుగా ఆసుపత్రికి బయల్దేరారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లాడు ఉన్న కిమ్స్ ఆసుపత్రికి ఆయనను పంపారు సీఎం రేవంత్. అయితే అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం నుండి ఆ అబ్బాయి వైద్యానికి అయ్యే ఖర్చులు భరిస్తాం అని పేర్కొన ఆయన.. తన వ్యక్తిగతంగా ప్రతిక్ ఫౌండేషన్ నుండి 25 లక్షల సాయం అందించనున్నారు కోమటిరెడ్డి.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఇకపై బెనిఫిట్ షో లు ఉండవు అని స్పష్టం చేసారు. అలాగే టికెట్ ధరల ను కూడా పెంచబోము అని చెప్పారు. ఇక అనుమతి లేకుండా హీరోలు ఎవరు సినిమా థియేటర్లకు వెళ్లినా కఠినంగా వ్యవహరిస్తాం అని స్పష్టం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.