అల్లు అర్జున్ పై ఫైర్ అయిన KA పాల్..!

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో అల్లు అర్జున్ వెళ్లిన తర్వాత సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన పై మాట్లాడిన తర్వాత నుండి ఈ విషయం పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చగా మారింది. సీఎం మాటలు విన్న తర్వాత చాలామంది అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ కూడా ఫైర్ అయ్యారు. పుష్ప 2 సినిమా దేశ వ్యాప్తంగా అత్యధిక డబ్బులు వసూళ్లు చేసింది. ఇప్పటికే ఆ సినిమా 1500 కోట్లకు మించి కలెక్షన్స్ సాధించింది.

కానీ ఆయన సినిమాకు వచ్చిన రేవతి అనే ఓ మహిళ చనిపోతే కేవలం 25 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. అంటే ఏమైనా బిక్షం వేస్తున్నారా అని ప్రశ్నించిన KA పాల్. ఒక జీవితం ఖరీదు 25 లక్షలా..? అల్లు అర్జున్ కొడుకు చనిపోతే 25 లక్షలు ఇస్తే ఊరుకుంటాడా అని అడిగారు. పుష్ప 2 సినిమాతో వచ్చిన లాభం మొత్తం ఆ కుటుంబానికి ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఓ 20 సినిమాలు చేసారు మీరు. అందులో ఓ సినిమా లాభం ఇస్తే ఏమవుతుంది అని పేర్కొన్నారు KA పాల్.

Read more RELATED
Recommended to you

Latest news