ఫార్ములా ఈ కార్ రేస్ లో దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ..!

-

ఫార్ములా ఈ కార్ రేస్ లో దర్యాప్తు ముమ్మరం చేసింది ఏసీబి మరియు ఈడీ. ఈ-కార్‌ రేసులో నోటీసులకు రంగం సిద్ధం అయ్యింది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు నోటిసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏసీబీ కేసు ఆధారంగా ఇప్పటికే ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. ఫార్ములా ఈ రేస్ వివరాల పై లోతైన దర్యాప్తు చేస్తుంది ఈడీ. ఫార్ములా ఈ కార్ రేస్ కంపెనీలు, 55 కోట్ల ట్రాన్సక్షన్ వివరాలు, స్పాన్సర్స్ షిప్ తప్పుకున్న కంపెనీ వివరాలు సేకరించింది ఈడీ.

అలాగే FEO కంపెనీలపై ఈడీ దృష్టి పెట్టింది. ప్రభుత్వం స్పాన్సర్ షిప్ ఇవ్వడం పై పూర్తి వివరాలు సేకరించింది ఈడీ. ఏసీబీ తో పాటు ఈడీ సైతం నోటిసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. హిమాయత్‌నగర్‌లోని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌కు వెళ్లనున్న ఏసీబీ.. RBI నుంచి లావాదేవీల వ్యవహారం పై నివేదిక కోరనుంది.

Read more RELATED
Recommended to you

Latest news