ఇవాళ అమరావతి కాపిటల్ సిటీ అథారిటీ మీటింగ్ జరిగింది అని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖా మంత్రి నారాయణ తెలిపారు. జోన్ 7 జోన్ 10 లే ఔట్లకు సంబంధించి అథారిటీ ఆమోదం తెలిపింది. ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్.. ఐకనిక్ బిల్డింగ్స్ హై కోర్ట్..అసెంబ్లీ బిల్డింగ్స్ కు సంబంధించి ఇప్పటివరకు 47 వేల కోట్లకి పైగా పనులకు ఆమోదం జరిగింది. త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అనేక దేశాల్లో పేదల ఇళ్లకు సంబంధించి అధ్యయనం జరిగింది.
గతంలో 7 లక్షల టిడ్కో ఇళ్ళు మంజూరు చెయ్యడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి 3 లక్షలు టిడ్కో ఇల్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసింది. కానీ గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను గందరగోళం చేసింది. టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే 7 లక్షల టిడ్కో ఇళ్ళు పూర్తి అయ్యేవి. 7 లక్షల ఇళ్లను గత ప్రభుత్వం 2 లక్షలకు తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ టిడ్కో ఇళ్ళ ప్రాజెక్ట్ కోసం 7 వేల 517 కోట్లు అవసరం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టిడ్కో పై సమీక్ష చేసాము. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై లోన్ తీసుకుని.. నిధులను పక్కదారి పట్టించారు. బ్యాంక్ లోన్లు క్లియర్ చేసి వచ్చే జూన్ లోపు లక్ష ఇళ్ళు పూర్తి అయ్యేలా చూడమని సీఎం చంద్రబాబు చెప్పారు అని మంత్రి నారాయణ పేర్కొన్నారు.