గాంధీభవన్‌ లో అల్లు అర్జున్ మామకు నిరాశ..!

-

అల్లు అర్జున్.. గత రెండు రోజులుగా సినిమా రంగంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా పేరు బాగా వినిపిస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో అందరూ బన్నీ గురించే చర్చించుకుంటున్నారు. అయితే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంతో రాజకీయ నాయకులు ఎక్కువగా బన్నీని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడే అయిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌ రెడ్డి తాజాగా గాంధీ భవన్‌ కు వచ్చారు.

దీంతో అల్లుడి కోసం మామ రంగంలోకి దిగాడు అని వార్తలు వచ్చాయి. కానీ గాంధీభవన్‌ లో అల్లు అర్జున్ మామకు నిరాశే ఎదురైంది. గాంధీ భవన్‌ కు వచ్చిన బన్నీ మామ చంద్రశేఖర్‌ రెడ్డి ఇంచార్జ్‌ దీపాదాస్‌ మున్షీని ఏఐసీసీ రూం కి వెళ్లి కలిసి.. మాట్లేడేందుకు ప్రయత్నం చేసాడు. కానీ దీపాదాస్‌ మున్షీ అల్లు అర్జున్‌ మామతో మాట్లాడలేదు. దీంతో చంద్రశేఖర్‌ రెడ్డి నిరాశగానే గాంధీ భవన్‌ నుంచి వెళ్లిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news