రేవతి కుటుంబానికి మైత్రీ మూవీస్‌ 50 లక్షల ఆర్ధిక సాయం..!

-

సంధ్య థియేటర్ లో పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవంత్ అనే మహిళా ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆమె కుమారుడు కూడా ఆ తొక్కిసలాటలో గాయపడి ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాబు ను చూడటానికి పుష్ప 2 సినిమా నిర్మాతలు కిమ్స్ కు చేరుకున్నారు. అక్కడే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో రేవతి భర్తకు మైత్రీ మూవీస్‌ తరపున 50 లక్షల చెక్ ను ఆర్ధిక సాయం కింద అందించారు.

అలాగే అనంతరం పుష్ప 2 నిర్మాతలు మాట్లాడుతూ.. రేవతి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది ఆ కుటుంబానికి తీరని లోటు. అయితే మేము శ్రీ తేజ్ ను చూడటానికి ఇకడైకి వచ్చాము. ప్రస్తుతం ఆ బాబు రికవరీ అవుతున్నాడు అని వారు పేర్కొన్నారు. అయితే గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రలో ఈ సంధ్య థియేటర్ ఘటనే పెద్ద ఎత్తున చర్చలో ఉన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news