మణిపూర్ లో రెండు జాతుల మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మణిపూర్ లో రెండు వర్గాల మధ్య జరుగుతున్న యుద్ధానికి అక్కడ సరఫరా అవుతున్న అత్యాధునిక ఏకే 47 కారణం అని ఆయన పేర్కొన్నారు. అక్కడున్న సంపదను దోచుకోవడానికి కార్పొరేట్ కంపెనీలు అంతర్ యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయి. కానీ ఇలాంటి వాటిపై పార్లమెంటులో చర్చ జరగటం లేదు అని తెలిపారు.
ఇకపై మణిపూర్లో పేలుతున్న ఏకే 47 లపై పార్లమెంటులో విస్తృత చర్చ జరగాలి. అయితే ఆదానీ పెట్టుబడులను వెంటనే రద్దు చేయలేము. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను సింగిల్ స్ట్రోక్ తో రద్దు చేసే పరిస్థితి ఉండదు. అలాగే మోడీ ప్రధాని అయ్యాక ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులు పెరిగాయి. అందుకు అనుగుణంగా రాజ్యాంగాన్ని కూడా మారుస్తున్నారు. కాబట్టి పార్లమెంటులో వ్యక్తుల మీద చర్చ కాదు.. ప్రైవేటు సంస్థల పెట్టుబడులపై విస్తృతంగా చర్చ జరగాలి అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.