కౌశిక్ తల్లిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. కౌశిక్ తల్లి దగ్గర డబ్బులు ఉన్నా ఆమె ఆసుపత్రికి కట్టలేదని సంచలన ఆరోపణలు చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. చెన్నై అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అంతా పూర్తి అయ్యాక ఫైనల్ బిల్లు రూ.60 లక్షలు అయిందని తెలిపారు. అందులో ఏపీ ప్రభుత్వం, టీటీడీ ఇచ్చిన రూ.51 లక్షలు కౌశిక్ తల్లి సరస్వతి ఆసుపత్రికి చెల్లించగా ఇంకో రూ.9 లక్షలు బిల్లు పెండింగ్ లో ఉందని వెల్లడించారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుడు.
మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా బయట ఇంకో రూ.13 లక్షలు పోగేసి కౌశిక్ తల్లికి ఇచ్చామన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుడు. అందులో రూ.9 లక్షలు కడితే అయిపోయేదని వివరించారు. అసలు ఆమె ఎందుకు అలా మాట్లాడిందో తెలియదన్నారు. మేము ఆసుపత్రికి వెళ్లి డిశ్చార్జ్ కు అన్ని ఏర్పాట్లు చేసి దగ్గరుండి ఇంటికి పంపించామని క్లారిటీ ఇచ్చారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుడు.
కౌశిక్ తల్లి దగ్గర డబ్బులు ఉన్నా ఆమె ఆసుపత్రికి కట్టలేదు
చెన్నై అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అంతా పూర్తి అయ్యాక ఫైనల్ బిల్లు రూ.60 లక్షలు అయింది
అందులో ఏపీ ప్రభుత్వం, టీటీడీ ఇచ్చిన రూ.51 లక్షలు కౌశిక్ తల్లి సరస్వతి ఆసుపత్రికి చెల్లించగా ఇంకో రూ.9 లక్షలు బిల్లు పెండింగ్ లో… pic.twitter.com/I36o7pTI3o
— BIG TV Breaking News (@bigtvtelugu) December 25, 2024