Police notices to MLA Kaushik Reddy: బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తాజాగా బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. కాసేపటి క్రితమే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు అందాయి. ఎల్లుండి ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు పోలీసులు.
బంజారాహిల్స్ సీఐ విధులకు ఆటంకం కలిగించాడని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఇక పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఇంకా బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పందించలేదు.
నోటీసులు జారీ చేసిన మాసబ్ ట్యాంకు పోలీసులు….బంజారాహిల్స్ సిఐ రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసును మాసబ్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 27న మాసబ్ ట్యాంక్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్నారు మాసబ్ ట్యాంక్ పోలీసులు.