ఆటోలో ప్రయాణిస్తున్న 17 ఏళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు కొందరు దుండగులు. అడ్డుకున్న ఆటో డ్రైవర్ పై దాడి.. బాలికను ఇంట్లో వదిలిపెట్టినా కూడా వదలలేదట. హైదరాబాద్‌లో బీహార్‌కు చెందిన బాలిక బోరబండలోని తన దగ్గరి బంధువుల వద్ద ఉంటోంది. మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో వంట మనిషిగా పనిచేస్తోందని సమాచారం.
అయితే జీతం కోసం మాదాపూర్ వెళ్లిందని అంటున్నారు. ఈ క్రమంలో బీహార్‌కు చెందిన యువకుడితో బోరబండ వెళ్లే ఆటో ఎక్కిందట ఆ బాలిక. ఈ తరుణంలోనే… 5 గురు యువకులు ఆటోను అడ్డగించి.. అందులోకి ఇద్దరు ఎక్కారట. అనంతరం బాలికను టచ్ చేస్తూ.. రెచ్చిపోయారు.
ఇక వారు దాడి చేసినప్పటికీ… ఆటో డ్రైవర్ ధైర్యంగా వారితో పోరాడని చెబుతున్నారు. ఆటో నుంచి వారిని బయటకు తోసేసి ఆటోను వేగంగా తీసుకెళ్లాడట. అనంతరం డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారట. దీంతో పోలీసులు వచ్చి.. వారిని అరెస్ట్ చేశారు. వారి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు…రిమాండ్ కు పంపారట.