తెలంగాణ కాంగ్రెస్ సర్కారుకు రాహుల్ గాంధీ అభినందనలు తెలిపడం పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఎందుకు అభినందనలు అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. దేనికి భేష్ ? దేనికి శభాష్ ? “మహాలక్ష్మి” మాయ చేసినందుకు భేష్ ?మహిళలు సిగలు పట్టుకుని కొట్టుకునే అరాచక పరిస్థితికి శభాష్ ? “రైతు భరోసా” వాయిదాల దిశ అయినందుకు భేష్ ? రైతుల చేతికి సంకెళ్లేసినందుకు శభాష్ ? “విద్యాభరోసా కార్డు” ఊసే ఎత్తనందుకు భేష్ ? విద్యార్థులకు పురుగులన్నం పెడుతున్నందుకు శభాష్ ? “ఇందిరమ్మ ఇండ్లు” ఇంకా రానందుకు భేష్? ఉన్న ఇండ్లు కూలగొడుతున్నందుకు శభాష్ ? “చేయూత”గా రూ.4000 ఫించను అందనందుకు భేష్ ? ఇచ్చే ఫించన్లు కూడా ఆలస్యం చేస్తూ ఏడిపిస్తున్నందుకు శభాష్ ? అంటూ పేర్కొన్నారు.
అలాగే రాష్ట్రంలో అభివృద్ధి ఆశ లేదు.. సంక్షేమం ఊసు లేదు. పనికొచ్చే పని లేదు.. పనికిమాలిన డైవర్షన్ పాలిటిక్స్‌కు అడ్డులేదు. ఏం సాధించిందని తెలంగాణ కాంగ్రెస్ సర్కారుకు శుభాభినందనలను చెప్తున్నాడో రాహుల్ గాంధీ అని ప్రశ్నించారు బండి.