నా వల్ల తప్పు జరిగితే తప్పకుండా సారీ చెబుతా : సీపీ సీవీ ఆనంద్

-

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. పుష్ప-2 మూవీ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో జాతీయ మీడియాపై కమిషనర్ సీవీ ఆనందర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు నేషనల్ మీడియా మద్దతు ఇస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలోనే క్షమాపణలు చెబుతూ తాజాగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తప్పును ఒప్పుకోవడం గొప్పవిషయమని ‘ఎక్స్’లో పలువురు నెటిజన్లు ప్రశంసించగా..ఓ నెటిజన్‌కు ఆయన రిప్లై ఇస్తూ.. ‘నా వల్ల తప్పు జరిగితే హోంగార్డుకు అయినా సారీ చెబుతా’ అని అన్నారు. ఈ అలవాటు నాకు క్రికెట్ ఆడటం వల్లే వచ్చిందని కమిషనర్ సీవీ ఆనంద్ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news