ఫార్ములా ఈ రేసింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ మరోసారి వాయిదా పడింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఈనెల 31కి క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా వేయగా.. మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్ కొట్టివేయాలని ఏసీబీ కౌంటరు దాఖలు చేసింది.
ఈ క్రమంలోనే క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేస్తూనే.. ఈనెల 31 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దంటూ స్టే పొడిగించింది. దీంతో కేటీఆర్‌కు ఊరట లభించినట్లు అయ్యింది. ఇదిలాఉండగా, ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఓవైపు ఏసీబీ అధికారులు దూకుడు పెంచగా.. తనపై అన్ని తప్పుడు కేసులు పెట్టారని కేటీఆర్ ఆరోపించారు.వీటిని కొట్టేయాలని ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.