డబ్బు చెల్లింపుతో నాకు సంబంధం లేదు : కేటీఆర్

-

హైకోర్టులో కేటీఆర్ అఫిడవిట్ సమర్పించారు. అయితే ఫార్ములా రేస్ ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు సంబంధం లేదు అని హైకోర్టులో దాఖలు చేసిన రిప్లై అఫిడవిట్‌లో పేర్కొన్నాడు కేటీఆర్. ఒప్పందాల అమలులో విధానపరమైన అంశాలను చూసే బాధ్యత.. మంత్రిగా తనది కాదన్నాడు కేటీఆర్‌. ఇక విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు పై అనుమతుల వ్యవహారాన్ని సంబంధిత బ్యాంక్ చూసుకోవాలన్నారు కేటీఆర్.

అయితే ఈ-కార్‌ రేస్‌కు ప్రమోటర్‌గా బాధ్యతలు తీసుకునే ముందు చెల్లింపుల విషయంలో చట్ట ప్రకారం అన్ని అంశాలను.. చట్టబద్ధమైన సంస్థ అయిన HMDAనే చూసుకోవాలన్నారు మాజీ మంత్రి. రూ.10 కోట్లు మించిన చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలన్న HMDA నిబంధనల్లో ఎక్కడా లేదన్న కేటీఆర్.. నిధుల బదిలీ మంత్రిగా తనకు సంబంధం లేని విషయం అని చెప్పారు. అలాగే 10వ సీజన్‌ పోటీలు జరగలేదు కాబట్టి రీఫండ్ కోసం… ఫార్ములా ఈ-రేస్ సంస్థకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news