ఒక నకిలీ ఐపీఎస్ అధికారి స్థాయి అధికారి తిరిగాడని అంటున్నారు. కానీ అది ఇంటిలిజెన్స్, పోలీసులు చూసుకోవాల్సిన బాధ్యత.. అది నాకు తెలియదు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నా చుట్టూ తిరిగిన ఐపీఎస్ అధికారి ఎవరు నాకు తెలియదు. ఈ అంశాన్ని డీజీపీ చూసుకోవాలి అని చెప్పారు. అలాగే ఎంపీపీలు అభివృద్ధికి అడ్డుకట్టలు వేస్తే బద్దలు కొట్టుకొని ముందుకెళ్తాం. అభివృద్ధి పనులకు ఎంపీపీలు అనుమతులు ఇవ్వకపోతే, 14 రోజుల్లో నోటిసు జారీ చేయాలని కలెక్టర్ ను కోరినట్లు పవన్ తెలిపారు.
అలాగే ఏ ఒక్కరిపై చేయి వేసినా ఇళ్లల్లో ఉన్న లాక్కచ్చి జైల్లో పెడతాము. గత ఐదు సంవత్సరాలుగా సుదర్శన్ రెడ్డి ప్రతాఫ్, శ్రీనివాసరెడ్డి ,సేకర్ నాయక్, జవహార్ బాబుల పై దాడులు చేశాడు. మా సహనానికి పరీక్ష పెట్టకండి. భవిష్యత్తులో ఏ ఒక్క ప్రభుత్వ అధికారిపై దురుసుగా ప్రవర్తించిన చూస్తూ ఊరుకోం. అవసరమైతే నా క్యాంపు కార్యాలన్నీ ఇక్కడ పెట్టడానికి కూడా నేను సిద్ధం. నా సహనాన్ని పరీక్షించవద్దు అని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.