ఎంపీడీవో పై జరిగిన దాడిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక కామెంట్స్ చేసారు. ఉదయం రిమ్స్ లో ఎంపీడీవో ను పరామర్శించాం. కుటుంబ సభ్యులు భయపడిపోతున్నారు. మండల అధ్యక్షులకు అయితే ఓకే, మీకు ఇవ్వడానికి వీలుకాదని ఆయన చెప్పాడు. నిన్న ఉపాధి హామీ సిబ్బంది లేకుంటే పరిస్థితి దారుణంగా ఉండేది. ఎంపీడీవోను దాడి నుంచి రక్షించేందుకు సిబ్బంది ఎంతగానో కృషి చేశారు. గెస్ట్ హౌస్ తాళం చెవి ఇవ్వడం సాధ్యం కాదని ఆయన అన్నారు. తాళం చెవి ఇవ్వమన్నందుకు ఎంపీడీవో పై కుర్చీలతో దాడులు చేశారు.
పోలీసులు ,ఎస్ఐ వచ్చిన గంటన్నరసేపు దాడి చేసిన వారు ఎంపీడీవో కార్యాలయంలోనే ఉన్నారు. 11 సీట్లు ఇస్తేనే వీళ్ళు ఇంత అహంకారం చూపిస్తున్నారు. ఇది ఎవరి జాగీరు కాదు. రకరకాల ముఠాలతో భయపెట్టాలని చూస్తే భయపడే ప్రభుత్వం కాదు ఎన్డీఏ ప్రభుత్వం. ఇలాంటి చిల్లర పనులకు ఎవరు భయపడరు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి మేము ప్రభుత్వంలో ఉన్నాం. ఇలాంటి పనులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే యువత కాదు అది. కాబట్టి యువతను రెచ్చగొట్టే పనులు చేయకండి అని పవన్ కళ్యాణ్ సూచించారు.