క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి శాప్ కృషి.. చైర్మన్ కీలక ప్రకటన

-

క్రీడాకారులతోపాటు ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతాల్లో క్రీడాప్రాంగణాలను అభివృద్ధి చేసేందుకు ఏపీ క్రీడాప్రాధికార సంస్థ కృషి చేస్తుందని శాప్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు పేర్కొన్నారు. విజయవాడ 4వ డివిజన్ పరిధిలోనున్న వెటర్నరీ కాలనీలో శిథిలావస్థకు చేరిన యూత్ హాస్టల్ భవనాన్ని స్థానిక వెటర్నరీ కాలనీ రెసిడెన్సియల్ అసోసియేషన్ సభ్యులతో కలిసి రవినాయుడు తాజాగా పరిశీలించారు. యూత్ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరడం కారణంగా అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డగా మారిందని, అలాగే ఆ ప్రాంగణమంతా నిరుపయోగంగా మారిందని అసోసియేషన్ సభ్యులు శాప్ ఛైర్మన్ కి వివరించారు. స్థానికులతోపాటు క్రీడాకారులందరికీ ఉపయోగంగా ఉండేలా యూత్ హాస్టల్ భవనాన్ని కూల్చివేసి ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని శాప్ చైర్మన్ సభ్యులు కోరారు.

ఈ సందర్భంగా శాప్ చైర్మన్ మాట్లాడుతూ.. స్థానికులకు, అసోసియేషన్ సభ్యులకు ఆమోదయోగ్యమైతే శాప్ ఆధ్వర్యంలో క్రీడాప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. విద్యార్థులకు, యువతకు, క్రీడాకారులకు ఉపయోగకరంగా మల్టీపర్పస్ ఇండోర్ హాలు, స్పోర్ట్స్ రెసిడెన్సియల్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చర్చించారు. దీనికి సంబంధించి తొలుత యూత్ హాస్టల్ స్థలం ఎవరి పరిధిలో ఉందో తెలుసుకుని సంబంధిత అధికారులతో MOU చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news