అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ కీలక విచారణ జరుగనుంది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు విచారణ జరుగనుంది. బెయిల్ పిటిషన్ పై నేడు పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. గత విచారణలో కౌంటర్ కు సమయం కోరారు పోలీసులు. అటు హైకోర్టు మధ్యంతర బెయిల్ తో బయట ఉన్నారు హీరో అల్లు అర్జున్.
గతంలో 14 రోజుల రిమాండ్ ముగియడంతో వర్చువల్ గా హాజరయ్యారు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై విచారణ జనవరి 10 కి వాయిదా పడింది. జనవరి 10 న అల్లు అర్జున్ రిమాండ్ పైన విచారణ జరగనుంది. ఈ తరుణంలోనే.. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ కీలక విచారణ జరుగనుంది. కాగా అటు అల్లు అర్జున్ కు తాజాగా రేవంత్ రెడ్డి అనుచరులు వార్నింగ్ ఇస్తున్నారు.