తెరాసను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్, తెదేపా, టీజేఎస్ పార్టీల కలయికతో ఏర్పడిన కూటిమిని మాయ కూటమిగా వర్ణించారు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తెరాస, భాజపా, ఎంఐఎం ఒక్కటేనని వాటి వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏమీ లేదని పేర్కొన్నారు. వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో నేడు బీఎల్ఎఫ్ ఏర్పడింది. ఈ సందర్భంగా బీఎల్ఎఫ్ గుర్తును (రైతు – నాగలి) ని తమ్మినేని ఆవిష్కరించారు. భావసారుప్యత కలిగిన పార్టీలతోనే దోస్తీ కొనసాగిస్తామని తెలియజేశారు. అక్టోబర్ 10లో గా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.